Shah Rukh Khan: జోక్స్ వేయడం మానేశా..
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:46 PM
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సెన్సాఫ్ హ్యూమర్, కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన కామెడీ చాలా మందికి చేదుగా అనిపిస్తుంది. అది కేవలం అపార్దాల వల్లనే అనేది వాస్తవం. కానీ.. అపార్దాలు, ఫేక్ న్యూస్ తో విసుగెత్తిపోయిన షారుఖ్ ఇక కామెడీ చేయనని చెప్పుకొచ్చాడు. ఇంతకు ఏం జరిగిందంటే..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్న సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. ఇందులో షారుఖ్ కూతురు సుహానా ప్రధాన పాత్రలో నటిస్తుంది. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టెన్‌మెంట్స్ నిర్మాణంలో ఈ సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులతో మాట్లాడారు.
షారుఖ్ మాట్లాడుతూ.. ‘‘నేను నా అభిమానులను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నా కుమారుడు ఆర్యన్ దర్శకత్వంలో తొలి అడుగు వేస్తున్నాడు. నటిగా నా కుమార్తె కూడా మీ ముందుకురానుంది. నాకు మీరిచ్చిన అభిమానంలో 50 శాతమైనా వారికి అందించండి. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. కొన్ని ఎపిసోడ్స్ చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి. నాకు అలాంటి హాస్యభరిత సన్నివేశాలంటే ఇష్టం. నేను జోక్స్ వేస్తే ప్రేక్షకులు కొందరు నేను కోపంగా మాట్లాడానని అనుకుంటున్నారు. అందుకే జోక్స్ వేయడం మానేశాను. నా వారసత్వాన్ని ఆర్యన్‌కు అందించి నన్ను గర్వపడేలా చేయమని చెప్పాను’’ అన్నారు.
మరోవైపు.. 'పఠాన్', 'జవాన్', 'డంకీ' చిత్రాలతో 2023లో హాట్రిక్ సక్సెస్ అందుకున్న షారుక్ ఖాన్. గత ఏడాది ఆయన నుంచి ఏ సినిమా రాలేదు. తదుపరి చిత్రం గురించి ఆయన స్వయంగా అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ వేదికపై మాట్లాడిన ఆయన త్వరలో ‘కింగ్’తో రానున్నట్లు చెప్పారు. సిద్థార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఇది రూపొందుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘పఠాన్’ తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.