Hansika: గృహ హింస కేసులో హన్సిక
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:37 PM
తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ నటి హన్సిక (Hansika) ముంబై హైకోర్టును ఆశ్రయించారు.

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ నటి హన్సిక (Hansika) ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్.ఎం. మోదక్‌లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ(Prasanth motwani).. బుల్తితెర నటి ముస్కాన్ (Muskan) జేమ్స్‌ను 2020లో వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సిక సహా సోదరుడు ప్రశాంత్, తల్లి జ్యోతిలపై ముస్కాన్ గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో హన్సిక, జ్యోతిలకు ముంబయి సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి ముంబై హైకోర్టును ఆశ్రయించారు.