Chiranjeevi: మేఘాల్లో మెగా ఫ్యాన్స్..!
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:13 PM
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) ఫ్యాన్స్‌కి ఇది నెక్స్ట్ లెవెల్ కిక్ ఇచ్చే న్యూస్. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న ఆయన మాసివ్ ప్రాజెక్ట్ విశ్వంభర ( Viswambhara) రిలీజ్ డేట్‌పై ఫైనల్లీ క్లారిటీ దొరికేసింది.
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) ఫ్యాన్స్‌కి ఇది నెక్స్ట్ లెవెల్ కిక్ ఇచ్చే న్యూస్. ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న ఆయన మాసివ్ ప్రాజెక్ట్ విశ్వంభర ( Viswambhara) రిలీజ్ డేట్‌పై ఫైనల్లీ క్లారిటీ దొరికేసింది. మొదట సంక్రాంతి 2025లో దిగుతుందని అనుకున్న ఈ మూవీ అనుకున్న సమయానికి రాకపోవడంతో.. ఆ తర్వాత మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ అవుతుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే ముందే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతోందని లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఆల్మోస్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు. అందువల్లే ఇన్నాళ్లు ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉంది. కానీ ఫైనల్లీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లుకొడుతోంది. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ ని జూలై 24న రిలీజ్ చేయాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేసినట్టు ఇన్‌సైడ్ టాక్. ఏప్రిల్ 12న నందిగామలోని హనుమాన్ స్టాచ్యూ దగ్గర ఫస్ట్ ఆడియో సింగల్ డ్రాప్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరాముడి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సాంగ్‌ను విడుదల చేయనున్నారట. అయితే ఇదే పాటలో కుర్ర హీరో కనిపించబోతున్నాడట టాక్ వినిపిస్తోంది. ఈ పాటతో ప్రమోషన్స్ ని కూల్‌గా కిక్‌స్టార్ట్ ఇవ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ బజ్.
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ గురించి ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఘరానా మొగుడు లాంటి ఐకానిక్ ఆల్బమ్ ఇచ్చిన ఈ కాంబో మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) మెగాస్టార్ కాంబోలో రాబోతున్న మెగా 157 మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకున్నారు మేకర్స్ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో విడుదల తేదీ ఖరారు కావడంతో.... షూటింగ్ పై ఫోకస్ పెట్టనున్నాడు అనిల్. షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నాడట. మొత్తానికి చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ రిలీజ్ డేట్స్ లాక్ కావడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.