Stree 2: నిర్మాత మాటల్ని తప్పుపడుతున్న నెటిజన్స్
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:38 PM
బాలీవుడ్‌లో కథానాయిక శ్రద్థాకపూర్ ఇటీవల ‘స్త్రీ 2’తో హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంచుకోవడంపై దర్శకుడు అమర్ కౌశిక్ స్పందించారు

బాలీవుడ్‌లో కథానాయిక శ్రద్థాకపూర్ (Shraddha kapoor) ఇటీవల ‘స్త్రీ 2’తో హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంచుకోవడంపై దర్శకుడు అమర్ కౌశిక్ (Amar Kaushik) స్పందించారు. ‘స్త్రీ’ (Stree 2,)సినిమా ప్లాన్ చేశాక కథానాయికగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందా? అని మేము ఎంతగానో ఆలోచించాం. అలాంటి సమయంలో శ్రద్థా కపూర్ పేరును ప్రతిపాదించారు నిర్మాత దినేశ్ విజయ్. కాబట్టి ఆ క్రెడిట్ పూర్తిగా ఆయనకే దక్కుతుంది. ఆ పాత్ర కోసం ఆమెను ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా నాతో చెప్పారు.
ఓసారి శ్రద్థాకపూర్, దినేశ్ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారు. చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారట. ఆమె అచ్చం దెయ్యంలా నవ్వుతుందని.. అందువల్ల ఈ పాత్రకు తను అయితే పూర్తి న్యాయం చేయగలదని ఆయన నాతో చెప్పారు’’ అని అమర్ కౌశిక్ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిర్మాత తీరును శ్రద్థా కపూర్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఆమెను హీరోయిన్‌గా పెట్టి మీరు డబ్బులు సంపాదించుకుని ఈ విధంగా మాట్లాడటం ఏమీ బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు.