Priya Prakash Varrier: క‌న్నుగీటే పిల్ల ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:46 PM

అజిత్ కుమార్ తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో నటించింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమా ఫలితం నిరాశకు గురిచేసినా... అజిత్ తో ఏర్పడిన అనుబంధం మాత్రం అద్భుతం అంటోంది ప్రియా!

'ఒరు అదార్ లవ్' సినిమాలో జ‌స్ట్ అలా క‌న్నుగీటి ఓవ‌ర్‌నైట్ సెల‌బ్రెటీ అయిపోయింది బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియ‌ర్ (Priya Prakash Varrier) ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసింది కానీ ఏదీ స‌రిగా ఆడ‌లేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌ళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. రీసెంట్ గా అజిత్ (Ajith) హీరోగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ( (Good Bad Ugly) సినిమాలో కీ- రోల్ లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అయినా... ఇందులోని స్పెషల్ సాంగ్ లో ప్రియా తన అందాలతో దుమ్మురేపడం కుర్రకారుని కిర్రెక్కిస్తోంది. ప్రియా ప్రకాష్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.


సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, తన క్యారెక్టర్‌కి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో ఫుల్ ఖుషీ అయ్యింది ప్రియా ప్రకాశ్‌ వారియర్. మ‌ళ్లీ ఇన్నాళ్ళకు అంద‌రూ త‌న గురించి మాట్లాడుకోవడంతో అమ్మడు ఎమోషనల్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి అజిత్‌కి థ్యాంక్స్ చెప్పింది. సినిమా షూటింగ్ లో పాల్గొన్న రోజు నుండి చివరి రోజు వరకూ అజిత్ త‌న‌ను కంఫర్ట్ జోన్ లో ఉంచారని చెప్పుకొచ్చింది. అజిత్ సెట్‌లో అందరినీ బాగా చూసుకునేవాడని, గౌరవించేవాడ‌ని, ఆయ‌న మంచిత‌నాన్ని విపరీతంగా పొగిడేసింది. స్టార్ హీరో అయినప్పటికి... ఎలాంటి గర్వం లేదని కితాబిచ్చింది. అజిత్ ఎంతో గొప్పవాడని, ఎంత ఎత్తుకు ఎదిగినా సింపుల్‌గా ఉండాలన్నది ఆయనను చూసి నేర్చుకున్నానని చెప్పింది. అజిత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన సీన్ త‌న‌ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని పోస్ట్ చేయగానే అది కాస్త వైరల్ గా మారింది.


అజిత్ డైమండ్ లాంటి వాడని తన మనసులో భావాలను రాసుకొచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్... ఎండింగ్ లో 'ప్రేమ‌, గౌర‌వంతో మీ వీరాభిమాని` అని ముగించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. కాగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో త్రిష (Trisha), అర్జున్ దాస్ (Arjun Das) కీలక పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. జీవీ ప్రకాశ్ (G.V. Prakash) సంగీతాన్ని అందించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయాన్ని పక్కన పెడితే... ఇంత దారుణమైన సినిమాను ఈ మధ్య కాలంలో చూడలేదని క్రిటిక్స్ వాపోతున్నారు. అయితే ప్రియా ప్రకాశ్ వారియర్ లాంటి వారికి మాత్రం ఈ సినిమా ఓ స్వీట్ మెమొరీ!

Also Read: Raid -2: నిషా కళ్ళతో నషా నింపుకుని తినేయమంటున్న తమన్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 12 , 2025 | 01:46 PM