Raid -2: నిషా కళ్ళతో నషా నింపుకుని తినేయమంటున్న తమన్నా

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:14 PM

అజయ్ దేవ్ గన్ నటిస్తున్న 'రైడ్ -2' మే 1న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని తమన్నా ఐటమ్ సాంగ్ తాజాగా విడుదలైంది.

అజయ్ దేవగన్ (Ajay Devgn) హీరోగా, రితేష్‌ దేశ్ ముఖ్ (Riteish Deshmukh)విలన్ గా నటిస్తున్న 'రైడ్ -2' (Raid -2)నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) చేసిన 'నషా' (Nasha) అనే ఐటమ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. విలన్ డెన్ లో సాగే ఈ పాటలో తమన్నా గతంలో మాదిరిగానే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడలేదు.


ఐటమ్ సాంగ్స్ తమన్నాకు కొత్తేమీ కాదు... అయితే రజనీకాంత్ 'జైలర్' సినిమాలో 'కావాలిరా' సాంగ్ చేసిన తర్వాత అది కాస్త సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ గా మారిపోయింది. దానికి కొనసాగింపుగా గత యేడాది 'స్త్రీ -2'లో చేసిన 'ఆజ్ కీ రాత్' సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో తమన్నాతో ఐటమ్ సాంగ్స్ చేయించడానికి నిర్మాతలు సెంటిమెంట్ గానూ రెడీ అయిపోతున్నారు. తాజాగా 'రైడ్ -2'లో తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ ను విడుదల చేసి చేయంగానే అది కాస్త వైరల్ అయిపోయింది. తమన్నా తనదైన స్టెప్స్ తో మరోసారి అదగొట్టేసింది. పంజాబీ స్లాంగ్ తో సాగే ఈ పాటలో తమన్నా... 'నేను పూర్తిగా నీ దానినే... నన్ను నీ కళ్ళతో తినేయ్' అంటూ హొయలు పోతుంటే... థియేటర్లలో మాస్ ఆడియెన్స్ విజిల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది. రాజ్ కుమార్ గుప్త దర్శకత్వంతో రూపుదిద్దుకున్న 'రైడ్ -2' ఓపెనింగ్స్ కు తమన్నా సాంగ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావించవచ్చు.

Also Read: Priyadarshi: 25కి సారంగపాణి జాతకం వాయిదా

Also Read: Vishwambhara: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ లో పాట విడుదల

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 12 , 2025 | 01:14 PM