Bhool Chuk Maaf: రాజ్ కుమార్ రావ్, వామికా పెళ్ళి అవుతుందా... లేదా...

ABN , Publish Date - Apr 11 , 2025 | 07:34 AM

రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి నటించిన వినోదాత్మక ప్రేమకథా చిత్రం 'భూల్ చుక్ మాఫ్‌'. కరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rao) తాజా చిత్రం 'భూల్ చుక్ మాఫ్‌' ట్రైలర్ వచ్చేసింది. వామికా గబ్బి (Wamiqa Gabbi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ (Maddock) సంస్థ నిర్మిస్తోంది. వారణాసికి చెందిన రంజన్.. తిత్లీని ప్రేమిస్తాడు. రెండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తేనే తన కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు కాబోయే మావగారు. ఈ లోగా పెళ్ళి తేదీ కూడా ఖరారు అవుతుంది. 30వ తేదీన అతని పెళ్లి జరగాల్సి ఉండగా... కాలం రెండు రోజుల ముందు జరిగిన హల్దీ వేడుక దగ్గర ఆగిపోతుంది. ప్రతి రోజూ రంజన్ నిద్రలేచే సరికీ కుటుంబం యావత్తు హల్దీ వేడుకలనే తిరిగి, తిరిగి జరుపుతూ ఉంటారు. అసలు రంజన్ జీవితంలో ఎందుకిలా జరిగింది? ఈ టైమ్ లూప్ ను దాటి అతను బయటకు వచ్చాడా లేదా? తిత్లీ మెడలో తాళి కట్టాడా లేదా? అనేదే 'భూల్ చుక్ మాఫ్' కథాంశం.


మే 10న 'భూల్ చుక్ మాఫ్‌' సినిమా జనం ముందుకు రాబోతున్న సందర్భంగా గురువారం చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. కరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ మిశ్రా, రఘువీర్ యాదవ్, జాకీర్ హుస్సేన్, సీమా పహ్వా, ఇస్తియాక్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సంస్థకు ఈ యేడాది మూడో రిలీజ్. దీనికి ముందు జనవరిలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) 'స్కై ఫోర్స్' (Sky Force) మూవీని, ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' (Chhaava) చిత్రాన్ని విడుదల చేసింది. మరి వేసవిలో వినోదాల జల్లు కురిపించబోతున్న 'భూల్ చుక్ మాఫ్' ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ

Also Read: JAAT Review: జాట్ రివ్యూ

Also Read: Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 11 , 2025 | 07:34 AM