Karan Johar: నాగరాజ్ గా కార్తీక్ ఆర్యన్

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:30 AM

యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ తో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. 'నాగరాజ్' అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aarayan) 'నాగరాజ్' (Naagraj) అనే పేరుతో ఓ హిందీ సినిమా చేయబోతున్నాడు. దీనిని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ (Karan Johar) నిర్మిస్తున్నాడు. గత కొంతకాలంగా కార్తిక్ ఆర్యన్ తో కరణ్‌ జోహార్ మూవీ నిర్మించబోతున్నాడనే మాట బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. కార్తీక్ సన్నిహితులు చెబుతున్న మాటల ప్రకారం ఈ యేడాది సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. 'నాగరాజ్' అనే ఈ సినిమాలో పాములతో చెలగాటం ఆడే పాత్రను కార్తీక్ చేయబోతున్నాడు. 'ఫుక్రే' ఫేమ్ మృగ్ దీప్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. గత యేడాది 'చందు ఛాంపియన్' (chandu champion), 'భూల్ భులయ్యా -3' (bhool bhulaiyaa 3) చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన కార్తీక్ ఆర్యన్ కు ఇదికూడా ఓ భిన్నమైన చిత్రమనే చెప్పాలి.

Also Read: Bhool Chuk Maaf: రాజ్ కుమార్ రావ్, వామికా పెళ్ళి అవుతుందా... లేదా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 11 , 2025 | 08:31 AM