Jacqueline Fernandez: జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మాతృ వియోగం

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:06 PM

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కిమ్‌ ఆదివారం ఉదయం కన్నుమూశారు.

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కిమ్‌ (kim) ఆదివారం ఉదయం కన్నుమూశారు. మార్చి 24న గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కిమ్‌ను ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆమె తుది శ్వాస విడిచారని నేషనల్  మీడియాలో వార్తలొచ్చాయి. కిమ్‌ మృతి పట్ల సినీ ప్రియులు,  జాక్వెలిన్‌ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 03:13 PM