Aryan Khan: ప్రమోషన్స్ కు దూరంగా ఆర్యన్ ఖాన్...

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:43 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కొడుకు తెరకెక్కించిన వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రమోషన్స్ కు ఆర్యన్ ఖాన్ దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

యాక్టర్ కొడుకు యాక్టర్ అవడం ... డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం చాలా కామన్. స్టార్ హీరోలైతే ఖచ్చితంగా తమ వారసులను హీరోలుగానే రంగంలోకి దింపేస్తుంటారు. కానీ అదంతా గతం. ఈ తరం వారసుల టేస్ట్ మారుతోంది. వారసత్వాన్ని పక్కనపెట్టి తమకు ఇష్టమైనదాన్ని ఎంచుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. నెపోటిజం అంటూ కొందరు ఎంత ట్రోల్ చేస్తున్నా... స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే కొంత మంది హీరో, హీరోయిన్లుగా వెండితెరపై మెరిసిపోగా మరికొందరు డైరెక్షన్ వైపులు అడుగులు వేస్తున్నారు.


బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) కు బీటౌన్‌లోనే కాదు.. ఆల్ ఓవ‌ర్ ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న కుమారుడు ఆర్యన్ ఖాన్ ( Aryan Khan) ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అని అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం ఫ్యాన్స్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అత‌ను డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ చాలా కాలంగా రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ రైటింగ్ విభాగంలో ఉన్న ఆర్యన్, న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో అవ‌స‌ర‌మైన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా వీక్షకుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు


ఆర్యన్ ఖాన్ 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' (Bads Of Bollywood) తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఫస్ట్ టైం మెగా ఫోన్ పట్టుకున్న కింగ్ ఖాన్ కొడుకు... తన ప్రాజెక్ట్ లోనే బిగ్ స్టార్లను సైతం చూపించబోతున్నాడట. లీడ్ రోల్స్ లో బాబీ డియోల్ (Bobby Deol) మోనా సింగ్ (Mona Singh) చేస్తున్నారట. అయితే ఎలాంటి క్యారెక్టర్లు చేయబోతున్నారన్న మ్యాటర్ మాత్రం రివీల్ కాలేదు. అంతేకాక ఈ సీరిస్ లో కొత్త నటులు లక్ష్య (Lakshya, ) సహేర్ బంబా (Sahher Bambba) కూడా యాక్ట్ చేస్తున్నారు. అలాగే గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, షారుఖ్ ఖాన్‌ సైతం మెరయబోతున్నారట. కరణ్ జోహార్ కాస్తంత సుదీర్ఘమైన అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. త్వరలో ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. అయితే ప్రమోషన్స్ కు మాత్రం ఆర్యన్ దూరంగా ఉంటడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జరిగిన డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ మీడియా సమావేశాల్లో హల్చల్ చేస్తుందేమో అనే భయంతోనే ఆర్యన్ ప్రచారానికి దూరంగా ఉంటున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టిన ఆర్యన్ వీటన్నింటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తేనే బాగుంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Odela -2: విజయ్ వర్మ గురించి దాటేసిన తమన్నా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 09 , 2025 | 05:49 PM