Renu Desai: పొలిటికల్‌ ఎంట్రీ.. రహస్యంగా దాచేది కాదుగా..

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:41 AM

రాజకీయాల గురించి రేణూ దేశాయి (Renu Desai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్‌ అంటే ఇష్టమేనా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు

రాజకీయాల గురించి రేణూ దేశాయి (Renu Desai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్‌ అంటే ఇష్టమేనా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘సామాజిక సేవ చేయడంలోనే నేను ఆనందం వెతుక్కుంటారు. ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదనుకుంటా. మన దేశంలో డబ్బు, ఆహారానికి లోటు లేదు. ఒకవేళ నేను ఏదైనా పొలిటికల్‌ పార్టీలో చేరితే తప్పకుండా చెబుతా. అది రహస్యంగా దాచేది కాదు కదా. నా స్నేహితుల పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంటా. పాలిటిక్స్‌లో నేను ఫిట్‌ కానని అనిపిస్తుంటుంది" అని అన్నారు.

గతంలోనే రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చిందని పిల్లల కోసం వదులుకున్నాను. రాజకీయాల్లోకి వెళ్లడమనేది నా జాతకంలోనే ఉంది. గతంలో ఓ ఛాన్స్‌ వచ్చింది. కేవలం పిల్లల పెంపకం కోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నా. ఇప్పటికీ అదే అభిప్రాయం. నేను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నా’’ అని పేర్కొన్నారు. అలాగే అకీరా సినిమాల ఎంట్రీ గురించి రేణూ మాట్లాడారు. అకీరాను రామ్‌చరణ్‌ పరిచయం చేయనున్నారనే వార్తలో నిజం లేదని వెల్లడించార. అలాగే ‘ఓజీ’ సినిమాకీ అకీరా పని చేయట్లేదు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు’’ అని ఆమె అన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 01:41 AM