Ram charan - Upasana: బంధం గురించి ఉపాసన ఏమన్నారంటే..
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:18 PM
వివాహం పూలపాన్పు కాదంటున్నారు రామ్‌చరణ్ (Ram charan) భార్య ఉపాసన కొణిదెల (Upasana konidela). ఇద్దరి మధ్య సరైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని, తనకూ చరణ్‌కూ మధ్య అది చక్కగా పనిచేస్తుందని చెప్పారు.
వివాహం పూలపాన్పు కాదంటున్నారు రామ్‌చరణ్ (Ram charan) భార్య ఉపాసన కొణిదెల (Upasana konidela). ఇద్దరి మధ్య సరైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే బంధం నిలబడుతుందని, తనకూ చరణ్‌కూ మధ్య అది చక్కగా పనిచేస్తుందని చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బిజినెస్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే రివ్యూ చేసుకుంటామో అలాగే బంధం విషయంలోనూ సమీక్ష తప్పనిసరి అని ఆమె అన్నారు. ఆమె ఉన్నతంగా మార్చుకోవడానికి ఉన్న చిట్కా ఏంటని సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూమ్ మినావాలా అడగ్గా, ‘‘మేమిద్దరం సమస్థాయి నుంచి వచ్చాం. మా పెళ్లి ముందే మాకు అవగాహన ఉంది. మనిషి విలువ, నమ్మకం, ఆరోగ్యకరమైన బంధం కొనసాగించడం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థిరంగా ఎదుర్కొగలిగ క్షణం చరణ్‌లో ఉంది. తండ్రి నుంచి అవి వచ్చాయి. అలాంటి వ్యక్తులు మహిళలు ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంతో సహకరిస్తారు. తను నాతో అలాగే ఉన్నాడు. ప్రతి దశలోనూ నాకు తోడుగా నిలిచాడు. అలాంటి వ్యక్తితో కలిసి ఉండటమే నా విజయ రహస్యం. మా కుటుంబం మొత్తం మా చుట్టూ ఉంటుంది. ఎప్పుడూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ఉంటాం. అది నా వైపు నుంచైనా, ఆయన వైపైనా. మాకెన్ని షెడ్యూల్స్ ఉన్నా, వాటిని సమన్వయం చేసుకుంటూ మాకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుంటాం. వారంలో ఒకరోజైనా ‘డేట్‌నైట్’ ఉండాలని మా అమ్మ చెబుతూ ఉంటారు వీలైనన్నిసార్లు అది సాకారం అయ్యేలా ప్రయత్నిస్తాం. ‘డేట్‌నైట్’లో ఇంటి వద్దే ఉంటాం. ఫోన్లు, టీవీలు దూరం పెట్టేస్తాం.
నేనూ, చరణ్ దీన్ని నెమ్మదిగా వ్యవస్థీకృతం చేయాలనుకుంటున్న. మా ఇద్దరికీ ఒకరితో ఒకరికి సమస్య ఉంటే, కచ్చితంగా కూర్చొని మాట్లాడుకుంటాం. అలా చేస్తే బంధం బలపడుతుంది. అది మరణించే వరకూ ఇది కొనసాగుతూనే ఉండాలి. వివాహ బంధంలో వీటిని ఆమోదించాల్సిందే. అంతేకాదు, రోజూ వాటిపై కసరత్తు చేయాలి. ఎప్పుడూ విడవకూడదు. అది శ్వాసలాంటిది. ప్రతి వివాహ బంధంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. మీ లక్ష్యాలు మీకు తెలిసినంత కాలం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ విషయంలో మాకు మంచి మార్కులు పడతాయి. తరచూ వివాహబంధాన్ని సమీక్షించుకుంటూ ఉండాలి. బిజినెస్‌లో ప్రతి లక్ష్యాన్ని సమీక్షించుకుంటాం. అది బంధం విషయంలో ఎందుకు ఉండకూడదన్నది నా అభిప్రాయం. ప్రతి మూడు నెలకొకసారి బోర్డు మీటింగ్‌లు జరిగినట్లే మీతో మీరు మీటింగ్ పెట్టుకోవాలి. మీ లక్ష్యా లను సమీక్షించుకోవాలి. మీ కుటుంబ, వ్యాపార లక్ష్యాలను నిరంతరం సమీక్షించుకోవాలి’’ అని ఉపాసన అన్నారు.