Odela 2: మోస్ట్ పవర్ ఫుల్ ట్రైలర్
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:50 PM
తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శివశక్తిగా తమన్నా (Tamannah Bhatia) కనిపించనున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మంగళవారం ట్రైలర్ (Odela 2 Trailer)ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ ఇందులోనూ కీలక పాత్ర పోషించారు. దుష్టశక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని మల్లన్న స్వామి ఎలా రక్షించాడనేది ఈ సినిమాలో కీలకాంశం.
Updated at - Apr 08 , 2025 | 05:50 PM