Jaat: సారీ చెప్పమంటున్న ఊర్వశీ రౌతేలా!

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:23 PM

ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'డాకు మహరాజ్'లో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టిన ఊర్వశీ రౌతేలా... ఇప్పుడు మరోసారి 'జాట్'లో డాన్సింగ్ నంబర్ లో చిందులేసింది.

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీడియోల్ (Sunny Deol) తాజా చిత్రం 'జాట్' (Jaat) ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దాంతో ఈ మూవీ పబ్లిసిటీ ని స్పీడప్ చేశారు మేకర్స్. సయామీ ఖేర్ (Saiyami Kher) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రతినాయకుడి పాత్రలలో రణదీప్ హుడా (Randeep Hooda) , వినీత్ కుమార్ సింగ్ (Vineet Kumar Singh) నటించారు. రణదీప్ సరసన రెజీనా కసండ్రా (Regina Cassandra) యాక్ట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశారు.


'జాట్' మూవీ నుండి ఫస్ట్ సింగిల్ 'టచ్ కియా'ను బుధవారం విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'డాకు మహరాజ్'లో స్పెషల్ నంబర్ తోనూ, స్పెషల్ క్యారెక్టర్ తోనూ కుర్రకారును ఊపేసిన ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) 'జాట్'లోనూ ఓ డాన్స్ నంబర్ లో చిందులేసింది. ఆమె పాటనే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేసిన ఈ పాటకు ఎస్. థమన్ స్వరాలు సమకూర్చారు. దీనిని మధుబంతి బాగ్చీ, షహీద్ మాలియా పాడారు. కుమార్ దీనిని రాశారు. ఈ పాటలో డాన్సర్స్ తో పాటు ఊర్వశీ రౌతేలా సెక్సీ స్టెప్స్ వేసిన ఆకట్టుకోగా, వినీత్ కుమార్ సింగ్ సైతం ఆమెతో కలిసి స్టెప్పులేశాడు. అలానే రణదీప్ హూడా, రెజీనా సైతం ఈ పాటలో కనిపించారు. భారీ అంచనాలతో రాబోతున్న 'జాట్'కు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

అన్నటు... 'టచ్ కియా' అంటూ రాగాలు పోయిన ఊర్వశీ రౌతేలా 'సారీ ఎందుకు చెప్పమం'దో తెలియాలంటే... ఈ డాన్స్ నంబర్ చూసేయాల్సిందే!

Also Read: Karate Kid - Legends : జాకీ చాన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 03 , 2025 | 01:14 PM