Empuraan Effect: పృథ్వీరాజ్ కూ ఐటీ నోటీసులు
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:36 PM
'ఎంపురాన్' సినిమా ఎఫెక్ట్ కేరళ చిత్రసీమను ఓ ఊపు ఊపుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ చిత్ర నిర్మాతతో పాటు పలువురు ప్రొడ్యూసర్స్ కార్యాలయాలను ఈడీ అధికారులు తనిఖి చేశారు. తాజాగా ఐటీ అధికారులు పృథ్వీరాజ్ కూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) కు కొచ్చి లోని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'ఎంపురాన్' (Empuraan) మూవీ మార్చి 27న విడుదల కాగా... ఆ తర్వాత రెండు రోజులకే ఐటీ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే... 'ఎంపురాన్' సినిమాలో గుజరాత్ అల్లర్లలను హైలైట్ చేయడం వల్లే ఇలా జరిగిందని కొందరు వాదిస్తుండగా, ఇది రెగ్యులర్ గా ఐటీ అధికారులు వృత్తిలో భాగంగా చేసే పనే అని మరికొందరు అంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. 'లూసిఫర్, బ్రో డాడీ, ఎల్ 2: ఎంపురాన్' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలానే కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
2022లో పృథ్వీరాజ్ నటించిన ''జన గణ మణ (Jana Gana Mana), గోల్డ్ (Gold), కడువ (Kaduva)' చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. వాటి ద్వారా అందుకున్న పారితోషికం తాలుకూ లెక్కలను కూడా ఐడీ శాఖ అధికారులు అడిగినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఐటీ అధికారులు మలయాళ చిత్ర నిర్మాతలపై కన్నేసి ఉంచారు. అక్కడి పలువురు నిర్మాతలు పన్నులు ఎగ్గొట్టిన కారణంగా వారిపై చర్యలకు సిద్ధపడుతున్నారు. తాజాగా 'ఎంపురాన్' నిర్మాత గోకులం గోపాలన్ ఆఫీస్ లనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. అందులో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ దగ్గరకూ వారు వెళ్ళినట్టు తెలుస్తోంది. తాజాగా ఐటీ అధికారులు పృథ్వీరాజ్ సుకుమార్ కు జారీ చేసిన నోటీసులకు ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వమన్నారట. ఏదేమైనా... ఈ సమయంలో ఈ రకమైన నోటీసులు అధికారుల నుండి రావడంతో ఇదంతా 'ఎంపురాన్' మూవీ ఎఫెక్టే అనే నిర్ణయానికే మెజారిటీ జనాలు వచ్చేశారు.
also Read: Rashmika Mandanna: బర్త్ డే జోష్ లో నేషనల్ క్రష్
Also Read: Test Movie: టెస్ట్ మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి