Rashmika Mandanna: బర్త్ డే జోష్ లో నేషనల్ క్రష్

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:53 PM

నేషనల్ క్రష్ రశ్మిక బర్త్ డే ఏప్రిల్ 5న. క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ తో గడిపే రశ్మిక పుట్టిన రోజు సందర్భంగా ఒమన్ కు వెళ్ళింది. అక్కడ నచ్చి ఫుడ్ తింటూ హాయిగా టైమ్ పాస్ చేస్తోంది.

నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణకు సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారంగా మారుతుందని భావించిన 'సికందర్' మూవీ నిరాశకు గురిచేసింది. అయితే... ఆ పరాజయానికి మనసులో చోటు దక్కనివ్వకుండా రశ్మిక ఏప్రిల్ 5న తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. 'యానిమల్, పుష్ప-2, ఛావా' చిత్రాలు జాతీయ స్థాయిలో ఆమెకు తెచ్చిపెట్టిన పేరుకు 'సికందర్' పరాజయం ఓ దిష్ఠిచుక్కలా మారిపోయిందని అనుకోవచ్చు. ఇదిలా ఉంటే... 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రశ్మిక బర్త్ డేను ఓమన్ లోని సలాలా ప్రాంతంలో జరుపుకుంటోంది. ఒక రోజు ముందే అక్కడి రెస్టారెంట్స్ లో విందు ఆరగిస్తూ... ఆ ఫోటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ పక్కనే బ్లాక్ అవుట్ ఫిట్ తో స్టైలిష్ గా కనిపిస్తూ, తాను ఇలా ఇష్టం వచ్చినట్టు తినడం ట్రైనర్స్ కు కోపం తెప్పిస్తుందంటూ ప్రకటించింది. మొన్నటి వరకూ కాలి గాయంతో చాలా ఇబ్బంది పడిన రశ్మిక మందణ్ణ ఇప్పుడు ఇలా హాయిగా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

rashmikamandan.jpg


ఇదిలా ఉంటే... రశ్మిక మందణ్ణ బర్త్ డే సందర్భంగా పలు నిర్మాణ సంస్థలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపాయి. ఇక రశ్మిక నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నుండి మేకర్స్ 'రేయి లోలోతుల సితార' అనే టీజర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పటి వరకూ వచ్చిన వాటికి పూర్తి భిన్నంగా ఉంది. రశ్మిక వారియర్ లుక్ లో గన్, కత్తి పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. దీనిని రాకేందు మౌళి రాశారు. పాట మధ్యలో కవితను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రాశారు. ఈ కవిత్వాన్ని, పాటను విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్నయి శ్రీపాద పాడారు. మంచి ఫీల్ తో ఈ పాట సాగింది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మిస్తున్నారు.

Also Read: Pradeep Machiraju: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మరో పాట

Also Read: Test Movie: టెస్ట్ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 05 , 2025 | 06:37 PM