Pradeep Machiraju: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మరో పాట
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:38 PM
ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న రెండో సినిమా 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' ఈ సినిమా నుండి తాజాగా మరో పాట విడుదలైంది. రథన్ ఈ మూవీకి స్వరాలు అందించాడు.
టీవీ యాంకర్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) రెండో సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (Akkada Ammayi Ikkada Abbayi). ఏప్రిల్ 11న ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ఇప్పటికే మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు లిరికల్ సాంగ్ కూడా విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుండి 'ప్రియమారా... మౌనాల చాటు మాటలే తెలియదా' అంటూ సాగే పాట జనం ముందుకు వచ్చింది. ఈ పాటకు రథన్ (Radhan) స్వరాలు సమకూర్చగా, రాకేందు మౌళి (Rakendu Mouli) సాహిత్యం అందించారు. దీనిని శరత్ సంతోష్, లిప్సికా భాష్యం పాడారు. సివిల్ ఇంజనీర్ గా ప్రదీప్ ఇందులో నటించగా, అతని సరసన దీపికా పల్లి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. నితిన్, భరత్ ద్వయం తెరకెక్కించిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.