Ajith: గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ విడుదల
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:49 PM
తమిళ స్టార్ హీరో అజిత్ ఓపక్క అభిమానులు ఈ నెల 10న 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో అలరించ బోతున్నాడు. అలానే తన కొడుకు అద్విక్ కు రేసింగ్ లో పాఠాలూ నేర్పుతున్నాడు.
అజిత్ (Ajith), త్రిష (Trisha) కీలక పాత్రలు పోషిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 10న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తమిళ వర్షన్ ట్రైలర్ ను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటుగా కాస్తంత ఎంటర్ టైన్ మెంట్ నూ ఇందులో మిళితం చేశాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో సిమ్రాన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే... కార్ అండ్ బైక్ రేసింగ్ లో పండిపోయిన అజిత్ కుమార్... తన కొడుకు ను యాక్టర్ గా కంటే ఫార్ములా రేసింగ్ లో చూడాలని ఉబలాటపడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ మధ్య దుబాయ్ రేసింగ్ లో విజయం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించిన అజిత్... అందరి దృష్టినీ ఆకర్షించాడు. దాంతో రెట్టించిన ఉత్సాహంతో కొడుకు అద్విక్ ను కార్ రేసింగ్ లోకి దింపాలని అజిత్ భావించినట్టుగా ఉంది. అజిత్, అతని భార్య షాలిని, కొడుకు అద్విక్ మికా గో కార్ట్ సర్క్యూట్ దగ్గర దిగిన ఫోటోను అజిత్ మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని చూస్తుంటే... అద్విక్ సైతం తండ్రి బాటలో ప్రయాణించడానికి రెడీ అవుతున్నట్టుగానే ఉంది. అలానే కొన్ని వీడియోస్ నూ అజిత్ సెక్రటరి పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇందులో అజిత్ కొడుక్కి రైడింగ్ టిప్స్ నేర్పుతున్నట్టుగా ఉన్నాడు. ఫిబ్రవరిలో వచ్చిన 'విడాముయార్చి' చిత్రం పరాజయం పాలైనా... అభిమానులంతా ఏప్రిల్ 10న రాబోతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫ్యామిలీ ఫోటోలతో డబుల్ బొనంజాను అజిత్... ఫ్యాన్స్ కు అందిస్తున్నట్టు అయ్యింది.
Also Read: Test Movie: టెస్ట్ మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి