Yash: యశ్ ‘టాక్సిక్‌’ లాంచ్‌.. సాధార‌ణ భ‌క్తుడిగా దేవాల‌యాల‌కు

ABN , Publish Date - Aug 06 , 2024 | 10:13 PM

'కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఫ్లాన్ చేశారు.

yash

'కేజీఎఫ్‌’ (KGF) సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ (Yash) కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. నయనతార (Nayanatara), హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వ‌చ్చింది.

WhatsApp Image 2024-08-06 at 9.22.48 PM.jpeg

కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం తర్వాత విరామం తీసుకున్న హీరో య‌ష్ త‌ను న‌టించ‌బోతున్న టాక్సిక్ చిత్రం షూటింగ్‌ను ఆగస్ట్ 8న బెంగళూరులో షూటింగ్ ప్రారంభించేందుకు ఫ్లాన్ చేశారు. అయితే ఈ 8 నంబ‌ర్‌కు య‌ష్‌కు ఓ ప్ర‌త్యేకత, బలమైన అనుబంధం ఉండ‌డం విశేషం. 8 అతని పుట్టిన తేదీ కాగా టాక్సిక్ సినిమా మొద‌టి అధికారిక ప్రకటన వెలువడింది అదే రోజు కావ‌డం గ‌మ‌నార్హం.

WhatsApp Image 2024-08-06 at 9.22.47 PM.jpeg


కాగా టాక్సిక్ షూటింగ్ కు ముందు యశ్ ఈ రోజు తన భార్య రాధిక మరియు నిర్మాత వెంకట్ కె నారాయణతో కలిసి కర్ణాటకలోని పలు దేవాలయాలను సందర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నాడు, అన్న‌దానాలు చేస్తూ సామాన్యుడిలా అంద‌రితో క‌లిసి భోజ‌నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.

WhatsApp Image 2024-08-06 at 9.22.48 PM (2).jpeg

ఇదిలాఉండ‌గా ఈ ‘టాక్సిక్‌’ (Toxic) సినిమా కీల‌క‌ భాగం యూకేలో చిత్రీకరించనున్నారని ఇందు కోసం దాదాపు 150రోజులకు పైగా సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేసిన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే 2013లో ఓటీటీలో విడుద‌లై మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్న ఆంగ్ల సిరీస్‌ ‘పీకీ బ్లైండర్స్‌’ (Peaky Blinders) ప్రేరణతో ద‌ర్శ‌కురాలు గీతూ ఈ కథను సిద్థం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో యశ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండ‌గా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

WhatsApp Image 2024-08-06 at 9.22.48 PM (1).jpeg

Updated Date - Aug 06 , 2024 | 10:13 PM