Shruti Haasan: ఎవరు ఊరికే గొప్పవారు కారు

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:48 PM

రజనీకాంత్‌తో (Rajinikanth) కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన అంత పెద్ద స్టార్‌గా ఎలా ఎదిగారో ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు అర్థమైంది. -శ్రుతీహాసన్‌


విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ గారాల కూతురు శ్రుతీహాసన్‌ (Shruti Haasan) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ (Coolie). రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతీ కీలక పాత్ర పోషిస్తుంది. లోకేశ్‌ కనగరాజ్‌  దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ కీ?క ్క్ష?త్ర?ని పోషించారు. పూజాహెగ్డే  స్పెషల్‌ సాంగ్‌తో అలరించనుంది. తాజాగా నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీతో కలిసి నటించడం గురించి శ్రుతీ  ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
నా కల నెరవేరింది..

‘‘రజనీకాంత్‌తో (Rajinikanth) కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన అంత పెద్ద స్టార్‌గా ఎలా ఎదిగారో ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు అర్థమైంది. క్రమశిక్షణ, అంకితభావం, క్యారెక్టర్‌ కోసం ప్రాణం పెట్టి పని చేయడం ఇలా ఎన్నో విషయాల్లో ఆయన్ని చూసి స్ఫూర్తిపొందాను. చాలా సింపుల్‌గా, వినయంగా ఉంటారు. సెట్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా పని చేస్తారు. ఆయన ఉంటే సెట్‌ అంతా పాజిటివ్‌గా ఉంటుంది. ఒక వ్యక్తిగానూ ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా ఇతరులతో ఎలా వ్యవహరించాలో రజనీకాంత్‌ని చూసి తెలుసుకున్నా. ‘కూలీ’లో నా పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుంది. లోకేశ్‌ దర్శకత్వంలో వర్క్‌ చేయడం నా కల. అందుకే ఆయన ఈ సినిమా గురించి చెప్పగానే అంగీకరించాను. ఇలాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలుంటాయి. వాటిని తెరపై చూపించడం నిజంగా సవాలే. లోకేశ్‌ వాటన్నిటినీ ధైౖర్యంగా ఎదుర్కొని దీన్ని తెరకెక్కించారు’’ అని శ్రుతిహాసన్‌ అన్నారు.

 

Updated Date - Mar 27 , 2025 | 05:48 PM