కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:46 AM
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు దర్శకద్వయం నితిన్, భరత్. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా...
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు దర్శకద్వయం నితిన్, భరత్. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించింది. మైత్రీమూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఈనెల 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ‘‘ప్రదీ్‌ప చాలా కాలంగా తెలుసు. ఈ కథ చెప్పగానే ఆయనకు నచ్చింది. పవన్‌కల్యాణ్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా పేరు ఈ ప్రాజెక్టుకుకచ్చితంగా సరిపోతుందనే తీసుకున్నాం. ఈ టైటిల్ మాకు పట్లిసిటీ పరంగానూ సాయపడింది’’ అని అన్నారు. భరత్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథకు చాలా స్పాన్ ఉంది. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే వినోదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్‌లో కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. అందరినీ అలరించి ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.