పాతబస్తీ నేపథ్యంలో

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:53 AM

ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించనున్న 60వ చిత్రాన్ని...

ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించనున్న 60వ చిత్రాన్ని ప్రకటించారు. ‘రౌడీ బాయ్స్‌’, ‘లవ్‌ మీ’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. నూతన దర్శకుడు ఆదిత్యరావు గంగసాని తెరకెక్కించనున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. త్వరలోనే తారాగణాన్ని, సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసి షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 03:53 AM