ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:51 AM

‘‘దర్శకుడు వీఎన్‌ ఆదిత్య నా దగ్గర పనిచేయకపోయినా, ఆయనంటే చాలా ఇష్టం. స్టార్స్‌తోనే సినిమాలు చేయకుండా.. కొత్తవాళ్లకూ...

‘‘దర్శకుడు వీఎన్‌ ఆదిత్య నా దగ్గర పనిచేయకపోయినా, ఆయనంటే చాలా ఇష్టం. స్టార్స్‌తోనే సినిమాలు చేయకుండా.. కొత్తవాళ్లకూ అవకాశం ఇస్తుంటాడు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన ‘ఫణి’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. వీఎన్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న గ్లోబల్‌ థ్రిల్లర్‌ ‘ఫణి’. మహేశ్‌ శ్రీరామ్‌, క్యాథరిన్‌ ట్రెస్సా జంటగా నటిస్తున్నారు. డాక్టర్‌ మీనాక్షీ అనిపిండి నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన మోషన్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో డా.మీనాక్షీ అనిపిండి మాట్లాడుతూ ‘‘ఇది చిన్న చిత్రంగా మొదలై పెద్ద ప్రాజెక్ట్‌గా మారింది. సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం. అన్ని రకాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు.

Updated Date - Apr 03 , 2025 | 03:51 AM