ప్రతి పాత్ర ప్రత్యేకంగా

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:39 AM

గూఢచారి సాహసాల నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘చైనా పీస్‌’. నిహాల్‌ కోధాటి...

గూఢచారి సాహసాల నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘చైనా పీస్‌’. నిహాల్‌ కోధాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలు. అక్కి విశ్వనాథరెడ్డి దర్శకుడు. మూన్‌లైట్‌ డ్రీమ్స్‌ బేనర్‌ నిర్మిస్తోంది. కమల్‌ కామరాజు, రఘుబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహాల్‌ కోధాటి పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. సీరియస్‌ లుక్‌లో నిహాల్‌ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు తనదైన ప్రత్యేకత ఉంటుందని యూనిట్‌ తెలిపింది. సంగీతం: కార్తీక్‌ రోడ్రిగ్జ్‌, సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు.

Updated Date - Apr 03 , 2025 | 03:39 AM