Vikram: సినిమా విడుదల ఆలస్యానికి కారణమదే.. నిర్మాత స్పందన..
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:28 AM
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Chiyaan Vikram) నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూర 2’ (Veera Dheera Sooran) మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అయింది.
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Chiyaan Vikram) నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూర 2’ (Veera Dheera Sooran) మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అయింది. దేశవ్యాప్తంగా చాలా మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. అంతేకాకుండా యూఎస్ ప్రీమియర్స్ విషయంలోనూ అదే జరిగింది. ఈ విషయంపై నిర్మాత శిబు (Producer Sibu) స్పందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆలస్యం జరిగిందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆలస్యం పట్ల హీరో విక్రమ్, ప్రేక్షకులకు క్షమాపణ చెప్పారు.
‘‘సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగిందంటూ సృష్టిస్తోన్న రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వడానికి ఈ పోస్ట్ పెడుతున్నాను. ఆధారం లేకుండా ఏదీ మాట్లాడవద్దు. థియేటర్‌లో విడుదలవ్వడానికి ముందు ఓటీటీ రైట్ సంస్థలు వారి హక్కులను సరైన సమయానికి విక్రయించలేకపోయారు. వారి పెట్టుబడులను రక్షించడం కోసమే.. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపాల్సి వచ్చింది. అనంతరం వారితో చర్చించి షోలు వేశాం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు సినిమా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘తంగలాన్’ తర్వాత విక్రమ్ నటించిన చిత్రమిది. ‘వీర ధీర శూరన్’ చిత్రాన్ని ‘వీర ధీర శూర పార్ట్ 2’గా విడుదల చేశారు. పార్ట్ 1 విడుదల కాకుండానే పార్ట్ 2 విడుదల చేశసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు మేకర్స్.