BharathiRaja: దర్శకుడు భారతీరాజా కుమారుడు హఠాన్మరణం
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:50 PM
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతిరాజా(Bharathiraja) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతిరాజా (48) మృతి చెందారు.
నటుడు, దర్శకుడు, భారతిరాజా (Bharathiraja) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తనయుడు మనోజ్ భారతిరాజా (48) మృతి చెందారు. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న మనోజ్.. చెట్‌పేట్‌లోని సొంత ఇంట్లో కోలుకుంటున్న క్రమంలో మరోసారి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మనోజ్ మరణించడంతో భారతిరాజా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారతిరాజా దర్శకత్వంలో తాజ్‌మహల్ చిత్రంతో 1999లో మనోజ్ నటుడిగా పరిచయం అయ్యారు. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆయన సముద్రమ్, కాదల్ పుక్కల్, వరుషమెల్లం వసంతం, ఈరనీలం వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.