Hanuman: ఓటీటీలోకి హనుమాన్‌.. ఎప్ప‌టినుంచంటే?

ABN , Publish Date - Jan 29 , 2024 | 04:19 PM

సంక్రాంతికి గుంటూరు కారం,నా సామిరంగ‌,సైంధ‌వ్ వంటి సినిమాల‌తో పోటీగా థియేట‌ర్లలో విడుద‌లై రికార్డుల సునామీ సృష్టించిన చిత్రం హ‌నుమాన్. అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసుకుంది.

Hanuman: ఓటీటీలోకి హనుమాన్‌.. ఎప్ప‌టినుంచంటే?
hanu man

సంక్రాంతికి గుంటూరు కారం,నా సామిరంగ‌,సైంధ‌వ్ వంటి సినిమాల‌తో పోటీగా థియేట‌ర్లలో విడుద‌లై రికార్డుల సునామీ సృష్టించిన చిత్రం హ‌నుమాన్ (Hanuman). చిన్న చిత్రంగా కేవ‌లం రూ.30 కోట్ల బ‌డ్జెట్‌లోపే రూపొందిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి దేశంలోనే ఈ ఏడాది మొట్ట‌మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రంగా,వంద కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ రూ.50 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఆ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు చిత్రంగా స‌రికొత్త చ‌రిత్ర లిఖించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. హ‌నుమాన్ (Hanuman) ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 (Zee 5) సంస్థ‌ ద‌క్కించుకోగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన మూడు వారాల‌కు ఓటీటీ స్ట్రీమింగ్ చేసుకునేందుకు ముంద‌స్తుగానే ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ లెక్క‌న ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి రెండో, మూడో వారంలో విడుద‌ల చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ సినిమా థియేట‌ర్ల‌లో బాగా ర‌న్ అవుతుండ‌డం, ఇంకా చాలామంది ప్రేక్ష‌కులు ఓటీటీలో సినిమాను చూసే అవ‌కాశం ఉండ‌డంతో జీ5 ఓటీటీ విడుద‌ల‌ను వాయిదా వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అన్నీ కుదిరితే శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి మొద‌టి వారంలో గానీ రెండో వారంలో 8వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీటిపై చిత్ర యూనిట్‌, జీ5 (Zee 5) నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.


రోజుకో సంచ‌ల‌నం సృష్టిస్తూ వ‌స్తున్న ఈ హ‌నుమాన్ చిత్రం తాజాగా మ‌రో మైలురాయిని దాటింది.ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌నుమాన్ సినిమాకు కోటి టికెట్లు అమ్ముడు పోయాయ‌ని ఇది ఓ తెలుగు సినిమాలో సంచ‌ల‌నం అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేగాక ముందుగా చెప్పిన‌ట్టు గానే సినిమా నుంచి వ‌చ్చే పైకంతో ఇప్ప‌టివ‌ర‌కు రూ.5 కోట్ల‌ను డొనేట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.ఇదిలా ఉండ‌గా ఓవ‌ర్సీస్‌లో 5 మిలియ‌న్స్ క‌లెక్ష‌న్స్ సాధించిన అతి త‌క్కువ తెలుగు చిత్రాల్లో ఒక‌టిగా హ‌నుమాన్ (Hanuman) చిత్రం నిలిచింది. ఇంకా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Updated Date - Jan 29 , 2024 | 06:55 PM