Rajeev Kanakala: చిన్ననాటి రోజులు, లవ్‌స్టోరీలు గుర్తొస్తాయి..
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:51 PM
రాజీవ్ కనకాల(Rajeev Kanakala), ఝాన్సీ (Jhansi) కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’ (Home town). మనసుని హత్తుకునే కుటుంబ కథతో రూపొందిన ఈ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు.
రాజీవ్ కనకాల(Rajeev Kanakala), ఝాన్సీ (Jhansi) కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’ (Home town). మనసుని హత్తుకునే కుటుంబ కథతో రూపొందిన ఈ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఆహా వేదికగా శుక్రవారం నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం మీడియా కోసం ఈ సిరీస్‌ను ప్రదర్శించారు. రాజీవ్ కనకాల మాట్లాడారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకులకు చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి. మేము కూడా ఇప్పుడే ఈ సిరీస్‌ను పూర్తిగా చూశాం. కొన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే 35 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాను. నా చిన్ననాటి లవ్‌స్టోరీలు, స్నేహితులతో చేసిన అల్లరి అన్నీ గుర్తుకువస్తున్నాయి. శ్రీకాంత్ హృద్యంగా రూపొందించారు. మాతోపాటు సిరీస్ చూసిన వారి రియాక్షన్స్ చూసి ఆనందంగా అనిపించింది’’ అన్నారు.
నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. ‘‘నలలలలల తర్వాత మా సంస్థ నుంచి వస్తోన్న సిరీస్ ఇది. అందులో యాక్ట్ చేసిన ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్‌లో స్టార్స్ అయ్యారు. అదే ఇప్పుడు రిపీట్ కావాలని కోరుకుంటున్నా. ఈ సిరీస్‌లో రాజీవ్ గారి పాత్ర.. మొదటి నుంచి లాస్ట్ వరకూ ఉంటుంది. ఆ సిరీస్‌కు ఎంతగా పేరు తెచ్చుకుందో ఈ సిరీస్‌కూ అంతే పేరు వస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు.