Deva: ఓటీటీలోకి పూజాహెగ్డే ముద్దులతో రెచ్చిపోయిన సినిమా
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:01 PM
పూజాహెగ్డే షాహిద్ కపూర్, పూజాహెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘దేవా’. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 31న విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది
పూజాహెగ్డే షాహిద్ కపూర్, పూజాహెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘దేవా’. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 31న విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ర్టీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. మార్చి 28 నుంచి ఇది స్ర్టీమింగ్ కానుందని తెలిపారు.
కథ:
ఏసీపీ దేవ్ నిజాయతీ పరుడైన పోలీస్ అధికారి. ఒక కీలకమైన కేసును ఛేదించే సమయంలో అతడికి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల అతడు జ్ఞాపకశక్తి కోల్పోతాడు. దీంతో ఒక కీలకమైన కేసు మధ్యలోనే ఆగిపోతుంది. ఇంతకీ దేవ్‌కు తన గతం ఎలా గుర్తుకు వచ్చింది? ఆ కేసు అతడు ఛేదించాడా? లేదా? అంత కీలకమైన కేసు ఏమిటి? జర్నలిస్ట్ దివ్య (పూజాహెగ్డే)కు దేవ్‌కు ఉన్న అనుబంధం ఏమిటి? అన్నది సినిమా.