Ajith Kumar New Movie: ఏకే వస్తున్నాడు

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:08 AM

అజిత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రం ఈ నెల 10న విడుదలకు సిద్ధమైంది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో విడుదలైన తెలుగు ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది

Ajith Kumar New Movie: తమిళ హీరో అజిత్‌కుమార్‌ నటించిన చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మించారు. త్రిష కృష్ణన్‌ కథానాయికగా నటించారు. షాయాజీ షిండే, జాకీ ష్రాఫ్‌, ప్రభు, సునీల్‌, అర్జున్‌దా్‌స, సిమ్రాన్‌, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 10న సినిమా విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నువ్వు పెద్ద విలన్‌వని విన్నా.. కానీ నా గేమ్‌లో నేనేరా నీకు విలన్‌’, ‘ఏకే వస్తున్నాడు దారివదలండ్రా’, ‘వాడు భయాన్ని భయపెట్టేవాడు’ వంటి సంభాషణలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.

Updated Date - Apr 08 , 2025 | 04:09 AM