Samantha Subham Movie Teaser: ఎక్స్‌లోకి రీ ఎంట్రీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:19 AM
నటి సమంత మళ్లీ ఎక్స్ (ఇకటి ట్విట్టర్) లోకి రీఎంట్రీ ఇచ్చి, తన నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ ప్రొడక్షన్ “శుభం” టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను ఎంతో ప్రేమతో తీర్చిదిద్దామంటూ అభిమానుల మద్దతు కోరారు
నటి సమంత సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ టీజర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘పెద్ద కలలతో మా టీమ్ చేసిన చిన్ని ప్రయత్నమిది.. ఎంతో ప్రేమతో చేసిన ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రీగుల దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైంది. త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 2012లో ఎక్స్(అప్పట్లో ట్విట్టర్) ఖాతాను ప్రారంభించారు సమంత. ఇటీవలె అందులో పెట్టిన అన్ని పోస్టులను తొలగించారు. అప్పటినుంచి ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఆమె ఎక్స్ ఖాతాను తిరిగి ఉపయోగించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆమెను స్వాగతిస్తూ పోస్టులు పెడుతున్నారు.