Kalyan Ram New Movie: ముచ్చటగా బంధాలే
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:23 AM
విజయశాంతి, కల్యాణ్‌రామ్ తల్లీకొడుకులుగా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో తల్లీకొడుకుల అనుబంధాన్ని హృదయపూర్వకంగా చూపించనున్నారు
Kalyan Ram New Movie: విజయశాంతి, కల్యాణ్‌రామ్ తల్లీకొడుకులుగా నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రం ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వీరిద్దరి పాత్రలు చాలా కీలకం. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బులుసు నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సెకండ్ సింగిల్ ‘ముచ్చటగా బంధాలే’ ను బుధవారం చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో విడుదల చేయనున్నారు. తల్లీకొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా వివరించే పాట ఇది. ఇటీవలె సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. రామ్‌ప్రసాద్ ఛాయాగ్రాహకుడు.