Khakee: The Bengal Chapter: ఖాకీ- ది బెంగాల్ చాప్టర్ సిరీస్ మెప్పించిందా..  

ABN , Publish Date - Mar 29 , 2025 | 02:03 PM

2022లో వచ్చిన నీరజ్ పాండే ‘ఖాకీ- ది బీహార్ చాప్టర్ కి సీక్వెల్ లో రూపొందింది ‘ఖాకీ- ది బెంగాల్ చాప్టర్ (Khakee: The Bengal Chapter). ఏడు ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ పొలిటికల్ క్రైమ్ సిరీస్  గతవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

2022లో వచ్చిన నీరజ్ పాండే (Neeraj Panday) ‘ఖాకీ- ది బీహార్ చాప్టర్ కి సీక్వెల్ లో రూపొందింది ‘ఖాకీ- ది బెంగాల్ చాప్టర్ (Khakee: The Bengal Chapter). ఏడు ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ పొలిటికల్ క్రైమ్ సిరీస్  (Crime Series) గతవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాలకు పైగా ఉన్న ఈ సిరీస్  వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం…


సాగోర్ తాలుక్దార్ (రిత్విక్ భౌమిక్), రంజిత్ ఠాకూర్ (ఆదిల్ జాఫర్) కోల్‌కతాలో పేరు మోసిన డాన్ బాఘా (సస్వత చటర్జీ) దగ్గర పని చేస్తుంటారు. బాఘా రూలింగ్ పార్టీకి చెందిన పొలిటీషియన్ బరుణ్ రాయ్ (ప్రసేన్ జీత్ ఛటర్జీ) పనులను చేసి పెట్టడమే కాకుండా అతను చేసే అక్రమ వ్యాపారాలకు అండదండగా ఉంటాడు. ఇదిలా ఉంటే బాఘా అండర్ వరల్డ్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టిన ఐపిఎస్ ఆఫీసర్ సప్తర్షి సిన్హా (పరంబ్రతా ఛటర్జీ) ను బాఘాకు తెలియకుండా సాగోర్, రంజిత్ చంపేస్తారు. దాంతో బాఘా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళవలసి వస్తుంది. అదే అదనుగా సాగోర్, రంజిత్ బాఘా ను దెబ్బతీసి అతని అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని బరుణ్ రాయ్ అండదండలతో ఏలాలని చూస్తారు. సప్తర్షి స్థానంలో వచ్చిన ఐపిఎస్ అర్జున్ మైత్రా (జీత్) చాకచక్యంగా సాగోర్, రంజిత్ మధ్య వైరం సృష్టిస్తాడు. అర్జున్ మైత్రా రాకతో సి.ఎంను ఆడిస్తూ వచ్చిన బరుణ్‌ రాయ్ ఆటలకు అడ్డు కట్ట పడిందా? అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంటరై పాపాలను కడిగేసుకోవాలనుకునే సాగోర్ జీవితం ఎలా మలుపు తిరిగింది. రంజిత్ కు, సాగోర్ మధ్య ఎందుకు చెడింది. బారున్ రాయ్ పొలిటికల్ గేమ్ కు ఎలా ఎండ్ కార్డ్ పడింది? వీటన్నింటికి సమాధానమే ఈ ఇంటెన్స్ పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘ఖాఖీ- ద బెంగాల్ చాప్టర్’.


Review.jpg

సిరీస్  చూస్తున్నంత సేపు ప్రస్తుత రాజకీయాలు ఎలా అసాంఘిక శక్తులతో ఎలా అంటకాగుతున్నాయో తెలియవస్తుంది. ఇందులోని సంఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట చూసినట్లుగా అనిపిస్తుంది. కథతో పాటు కథనాన్ని డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సిట్ ఆఫీసర్ అర్జున్ మైత్ర గా జీత్ చక్కటి నటనను ప్రదర్శించాడు. ఇక సాగోర్, రంజిత్ గా నటించిన రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఆ పాత్రల్లో జీవించారు. పోలీస్ ఆఫీసర్ ఆకాంక్ష సింగ్ పోషించిన పాత్రలోని ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఒక్కో ఎపిసోడ్ 50కి పైగా నిమిషాలతో లెంగ్తీగా అనిపిస్తాయి. వాటిని 35 నిమిషాలకు కుదించి తీయగలిగితే ఈ సీరీస్ మరింత అద్భుతంగా ఉండేది.  ఇక అక్కడక్కడా వాడిన బూతులు పంటికింద రాళ్ళలాగా ఉంటాయి. నీరజ్ పాండే చక్కటి బ్యాక్ డ్రాప్ ను రెడీ చేయటమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా రూపొందించాడు. దర్శకద్వయం దేబాత్మమండల్, తుషార్ కాంతి రాయ్ నెరేషన్ కూడా బాగుంది. కొంచెం ఎపిసోడ్స్ ను ట్రిమ్ చేసి ప్రజెంట్ చేసి ఉంటే మరో లెవల్ లో ఉండేది. ఈ సీరీస్ కి సంబంధించి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముందు చెప్పినట్లు ఎడిటర్ ప్రవీణ్ తన కత్తెరకు కొంచెం పదును పెట్టి ఉండాల్సింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవర్ ఆల్ గా ఖాకీ – ది బెంగాల్ చాప్టర్ క్రైమ్ సీరీస్ ను ఇష్టపడే వారికి నచ్చుతుంది.

ట్యాగ్ లైన్: పొలిటికల్ క్రైమ్ డ్రామా

Updated Date - Mar 29 , 2025 | 02:03 PM