Citadel: ప్రియాంక సీరిస్ తో రూ. 2135 కోట్ల నష్టం
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:31 PM
ప్రియాంక చోప్రా సిటాడెల్ సీజన్ 2 స్ట్రీమింగ్ వాయిదా పడింది. మొదటి సీజన్ కు భారీ నష్టాలు రావడంతో సీజన్ 2 బిజినెస్ లో భారీ లోటు జరిగిందని తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వెబ్ సిరీస్‌ల కోసం వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఈ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కూడా బాగానే ఉంటోంది. చాలా సిరీస్‌లు కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ సిటాడెల్ (Citadel) - సీజన్ 1 మాత్రం ఈ హైప్‌ను అందుకోలేక ఫ్లాప్ అయింది. దేశీగాళ్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించినా, అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాదాపు 2,560 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్, 2,135 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. స్టార్ కాస్ట్ ఉన్నా, ప్రేక్షకులు ఎందుకో దీన్ని ఆదరించలేదు. దీంతో నెక్స్ట్ పార్ట్ స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారట.
సిటాడెల్ సీజన్ 1 ఫెయిల్ అవ్వడంతో, సీజన్ 2 గురించి సందేహాలు మొదలయ్యాయి. సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అని అంతా ఆలోచనలో పడ్డారు. అయితే సెకండ్ సీజన్ అప్పటికే మొదలు పెట్టడంతో ప్రైమ్ వీడియో టీమ్ బడ్జెట్‌ను భారీగా కుదించిందని అంటున్నారు. పరిమిత ఖర్చుతోనే రెండో సీజన్‌ను తీసుకు రావాల్సి వచ్చిందట. నిజానికి ఈ సీజన్ షూటింగ్ 2024 నవంబర్ చివరికి పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు ముగిసినా, ఆర్థిక సమస్యల కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ 2026కి వాయిదా పడిందని అంటున్నారు.
అక్కడ సిటాడెల్ ఫట్ అయినా, ఇక్కడ ఇండియన్ వెర్షన్ మాత్రం హిట్ కొట్టింది. రాజ్ అండ్ డీకే రూపొందించిన "సిటాడెల్ - హనీ బన్నీ" అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ సక్సెస్ సాధించింది. ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా పాత్రలో సమంత (Samantha) నటించి, మంచి పేరు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ వెర్షన్ భారీ నష్టాలతో సతమతమైతే, ఇండియన్ వెర్షన్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు భారీ బడ్జెట్ తో తీసిన ఈ సీరిస్ నష్టాల్లో కూరుకుపోతే, ఇక్కడ స్మార్ట్‌గా తీసిన సిరీస్ హిట్ అవడం ఓటీటీ నిర్మాతలకు కొత్త పాఠం నేర్పినట్టయ్యింది.
Also Read: L3: The beginning: ముళ్ళబాటపై మోహన్ లాల్ తనయుడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి