The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:59 AM
ఓటీటీలో అత్యంత క్రేజ్ సాధించిన సిరీస్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. క్రేజ్ మాత్రమే కాదు అత్యధిక వ్యూవర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా కావడం విశేషం. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిలర్ సిరీస్ ఇప్పుడు మూడోసారి అలరించడానికి సిద్ధమైంది
ఓటీటీలో అత్యంత క్రేజ్ సాధించిన సిరీస్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. క్రేజ్ మాత్రమే కాదు అత్యధిక వ్యూవర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా కావడం విశేషం. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిలర్ సిరీస్ ఇప్పుడు మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్ పార్ట్ 3(The Family Man 3)లో జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat) ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ‘సీజన్2’లో సమంత ప్రతినాయకురాలిగా నటించారు. తమిళ టైగర్స్ తరపున పోరాటం చేసే మహిళగా ఆమె నటించారు. ప్రస్తుతం మూడో సీజన్ కోసం సినీప్రియులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పాయ్ (Manoj bajpai) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘పాతాళ్‌లోక్-2’లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న జైదీప్ అహ్లావత్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ (The Family Man 3)లో కనిపించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ సిరీస్‌లో భాగమయ్యారు. ఆయన ఉన్నట్లు తెలిసినప్పటికీ రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్లు ఎవరికీ తెలియదు. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే బయటకు ఏమీ చెప్పలేం. నవంబర్ నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో సీజన్ 2 స్ర్టీమింగ్ అవుతుంది’’ అని అన్నారు.