Ashwin Babu New Movie: శక్తిమంతమైన లుక్‌లో
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:03 AM
అశ్విన్‌బాబు ప్రధాన పాత్రలో ఎం.ఆర్.కృష్ణ తెరకెక్కిస్తున్న ‘వచ్చినవాడు గౌతమ్’ మెడికల్ యాక్షన్ మిస్టరీగా రూపొందుతోంది. తాజాగా విడుదలైన అశ్విన్ లుక్ అతని పాత్ర శక్తివంతంగా ఉందని సూచిస్తోంది
అశ్విన్‌బాబు హీరోగా ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’. టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అభినయ, రియా సుమన్, ఆయేషా ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్‌బాబు లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన పాత్ర శక్తిమంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ యాక్షన్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డీఓపీ: ఎం.ఎన్.బాల్‌రెడ్డి, సంగీతం: గౌరహరి.