Kingston Ott: ‘కింగ్‌స్టన్’ ఓటీటీ డేట్ ఫిక్స్
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:56 PM
గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. శాటిలైట్‌లోనూ సందడి చేయనుంది.
జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన సీ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా ‘కింగ్‌స్టన్’ (Kingston). దివ్య భారతి (Divya Bharathi) హీరోయిన్. కమల్ ప్రకాశ్ (Kamal Prakash) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. శాటిలైట్‌లోనూ సందడి చేయనుంది. ఏప్రిల్ 13 నుంచి ‘జీ 5’లో, అదే రోజు ‘జీ తమిళ్’ ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ‘జీ 5’ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
కథ:
తమిళనాడు సముద్ర తీర గ్రామంలోని తూవత్తూర్‌లో జరిగే కథ ఇది. 1982లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఆ ఊరి స్థితిగతుల్నే మార్చేస్తుంది. మత్స్యకారులైన ఊరి ప్రజలు సముద్రంలోకి వెళితే శవాలై తిరిగొస్తుంటారు. అందుకు ఆత్మలే కారణమని ఆ ఊరంతా నమ్ముతుంది. దాంతో, సముద్రంలోకి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు. తీరం మూసేయడంతో క్రమంగా ఊరి ప్రజలు ఉపాధిపి కోల్పోతారు. ఇదే అదనుగా చేసుకున్న ఓ ముఠా తాము చేస్తున్న అసాంఘిక కార్యకలాసాల్లోకి ఉపాధి పేరుతో తూవత్తూర్ యువకుల్ని లాగుతుంది. కింగ్‌స్టన్ అలియాస్ కింగ్ (జీవీ ప్రకాశ్‌కుమార్) సహా కొద్దిమంది యువకు?ని అలా ఆ ముఠాలో చేరి పని చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ముఠా చేస్తున్న అక్రమ వ్యవహారాలు బయటికొస్తాయి. దాంతో, కింగ్‌స్టన్ ఆ ముఠాని ఎదిరించి తిరిగి ఊరికి వస్తాడు. తన తాత వారించినా వినకుండా ేస్నహితులతో కలిసి సముద్రంలోకి బయలుదేరతాడు. తర్వాత ఏం జరిగింది? కింగ్‌స్టన్ బృందాన్ని సముద్రంలోని ఆత్మలు ని ఏం చేశాయి? ఇంతకీ ఆ ఆత్మ? కథేంటి? అన్నది సినిమా ఇతివృత్తం.