Deepika Padukone: షారుఖ్‌తో మళ్లీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:15 AM
షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కింగ్’ సినిమాలో దీపిక పదుకోన్ తల్లి పాత్రలో కనిపించనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీపిక తల్లిగా నటించడం చూసి అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు
Deepika Padukone Mother Role: షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘కింగ్’ గురించి వినిపిస్తున్న ఒక కొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించే ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను దీపిక పదుకోన్ పోషించనున్నారట. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా.. సుహానాకు ఆమెకు తల్లిగా నటించడం ప్రత్యేకతేగా మరి. షారుఖ్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఆ పాత్ర ప్రాధాన్యం గురించి దీపికకు చెప్పి ఆమెను ఒప్పించారట. షారుఖ్ చిత్రంలో దీపిక మళ్లీ నటిస్తున్నందుకు ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇందులో ఆమెది తల్లి పాత్ర అని తెలియగానే నీరస పడిపోతున్నారు. ఎందుకంటే.. ‘దీపికకు 39 ఏళ్లు, సుహానాకు 24 ఏళ్లు. వీరిద్దరికి పదిహేనేళ్ల ఏజ్ గ్యాపే ఉంది కనుక తల్లీకూతుళ్లుగా కంటే అక్కా చెల్లెళ్లుగా చూపిస్తే బాగుంటుంది.. ఆలోచించండి ఖాన్ సాబ్’ అని అభిమానులు అభ్యర్థిస్తున్నారట.