Godari Gattu Painaa Movie: గోదారి అందాల నడుమ

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:59 AM

విక్టరీ వెంకటేశ్‌ సినిమా పాటను ప్రేరణగా తీసుకుని రూపొందుతున్న ‘గోదారి గట్టు పైన’ చిత్రంలో సుమంత్‌ ప్రభాస్‌, నిధి ప్రదీప్‌ జంటగా నటిస్తున్నారు. పశ్చిమ గోదావరి అందాలు, భావోద్వేగాల మేళవింపుతో ప్రశాంతమైన అనుభూతిని కలిగించే సినిమాగా తెరకెక్కుతోంది

Godari Gattu Painaa Movie: విక్టరీ వెంకటేశ్‌ నటించిన సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ‘గోదారి గట్టుపైన’ పాట ఎంత పాపులర్‌ అయిందో చెప్పనక్కర్లేదు. ఆ పాటలోని మొదటి పదాన్ని తమ సినిమాకు టైటిల్‌గా నిర్ణయించింది రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ. ‘గోదారి గట్టు పైన’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారు. సుభా్‌షచంద్ర దర్శకుడు. నిధి ప్రదీప్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఒక చల్లని సాయంత్రం వేళ ప్రశాంతమైన గోదావరి ఒడ్డున మీ స్నేహితులతో కూర్చుని సమయం గడపడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. మా సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అందమైన భావోద్వేగాలతో ఉంటుంది. గోదావరి జిల్లాలు వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. పశ్చిమ గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి’ అని దర్శకుడు చెప్పారు. రాజీవ్‌ కనకాల, లైలా, దేవీ ప్రసాద్‌, హర్షవర్థన్‌, సుదర్శన్‌, రాజ్‌కుమార్‌ కాసిరెడ్డి, వివా రాఘవ్‌, రోహిత్‌ కృష్ణ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభినవ్‌ రావు ఈ చిత్రానికి నిర్మాత.

Updated Date - Apr 08 , 2025 | 04:00 AM