Raakshasa Kaavyam: ఓటీటీలోకి మస్ట్ వాచ్ మూవీ.. సింపుల్‌గా తీసి పడేయకండి..
ABN , First Publish Date - 2023-12-13T08:00:59+05:30 IST
మరో ఆసక్తికరమైన సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయింది. చెప్పడానికి, చూడడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాను అంత సింపుల్‌గా తీసి పడేయడానికి లేదు.

మరో ఆసక్తికరమైన సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయింది. చెప్పడానికి, చూడడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాను అంత సింపుల్‌గా తీసి పడేయడానికి లేదు. అదే ఆక్టోబర్‌లో విడుదలైన స్ట్రెయిట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రాక్షస కావ్యం (Raakshasa Kaavyam). అభయ్ బేతిగంటి (Abhay Bethiganti), కుశాలిని (Kushalini Pulapa), అన్వేష్ మైఖేల్ (Anvesh Michael), పవన్ రమేష్ (Pawon Ramesh), దయానంద్ రెడ్డి (Dayanand Reddy) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దామురెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించగా శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించాడు.
పురాణాల గురించి చెబుతూ సాయికుమార్ వాయిస్ ఓవర్‌లో ప్రారంభమయ్యే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం వినూత్నంగా మన అంచనాలను చిక్కకుండా సాగుతూ అసలు పాయింట్‌కి వచ్చే సరికి అమ్మ సెంటిమెంట్, ఎడ్యుకేషన్ నేపథ్యంలో మైథాలజీని నేటి పరిస్థితులకు అన్వయిస్తూ థ్రిల్లింగ్‌గా నడుస్తుంది. చదువన్నా, చదువుకునే వారన్నా బాగా ఇష్టం ఉండే అజయ్ అనే కాంట్రాక్ట్ కిల్లర్, కేవలం విలన్లను హైలెట్ చేస్తూ సినిమాలు తీయాలనుకునే విజయ్ అనే ఇద్దరి చుట్టూ ఈ సినిమా మొత్తం తిరుగుతుంది.
సెకండాఫ్ కాస్త గజిబిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాలోని అమ్మ సెంటిమెంట్, కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. మన పురాణాలలోని క్యారెక్టర్లు ప్రస్తుతం భూమిపై ఉంటే అనే ప్రయోగంతో రా అండ్ రస్టిక్‌గా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండేలా తెరకెక్కించారు. ఈ సినిమాలో మనం నిజ జీవితంలో వాడే నేటివ్ లాంగ్వెజ్‌నే వాడగా, సంగీతం,పాటలు కూడా బావుంటాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఆహా (ahavideo IN) ఓటీటీలో డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో మాత్రం మిస్ అవకండి.