Charu Asopa: నటనకు స్వస్తి పలకలేదట...

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:23 PM

సుస్మితా సేన్ మాజీ మరదలు చారు కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుల్లితెర నటి అయిన చారు ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.

గత రెండు, మూడు రోజులుగా సినిమా, బుల్లితెర నటి చారు అసోపా (Charu Asopa) కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ (Susmitha Sen) మాజీ మరదలైన చారు ప్రస్తుతం ముంబైను వీడి బికనీర్ లో ఉంటోంది. అయితే... సల్వార్ సూట్స్ ను పట్టుకుని ఉన్న ఆమె వీడియో మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దానిని చూపిస్తూ... ఒకప్పటి నటి, సుస్మితా సేన్ మాజీ మరదలు బికనీర్ లో ఆన్ లైన్ లో బట్టల వ్యాపారం చేసుకుని జీవితాన్ని గడుపుతోందని, ఆమె కడు బీదరికంలో ఉందని ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్యానించడం మొదలెట్టారు.


charu1.pngసుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ (Rajeev Sen) బాలీవుడ్, టీవీ నటి చారు అసోపా ను 2019లో ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆమెకు సోమ్ వీర్ పుజారితో వివాహమైంది. పెళ్ళైన తొమ్మిదేళ్ళకు వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను రాజీవ్ సేన్ పెళ్ళాడాడు. అయితే ఈ రెండో పెళ్ళి కూడా మూడునాళ్ళ ముచ్చట గా మారింది. 2023లో రాజీవ్ సేన్, చారు అసోపా విడిపోయారు. వాళ్ళకు ఓ పాప ఉంది. సినిమా, టీవీ సీరియల్స్ లో అవకాశాలు తగ్గిపోవడంతో చారు బికనీర్ కు షిఫ్ట్ అయిపోయింది. ఇదే సమయంలో ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో 'ఒకప్పటి నటి దీనగాథ' అంటూ విపరీతంగా దానిని కొందరు వైరల్ చేశారు.


తాజాగా ఈ వీడియోపై చారు అసోపా క్లారిటీ ఇచ్చింది. అందరూ అనుకుంటున్నట్టుగా తాను అంత బీదరికంలో లేనని స్పష్టం చేసింది. డైలీ సీరియల్స్ లో నటించ కూడదని అనుకున్నానని, కానీ నటనకు స్వస్తి పలకలేదని తెలిపింది. ఇప్పటికీ వెబ్ సీరిస్, సినిమాల్లో ఛాన్స్ వస్తే ముంబైకి వెళ్ళి నటిస్తానని చెప్పింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందని, దాంతో కూతురును తీసుకుని బికనీర్ షిఫ్ట్ అయ్యానని తెలిపింది. అంతే తప్పితే తాను ఆర్థికంగా చితికిపోయానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పింది. చారు ఈ క్లారిటీ ఇవ్వడానికి ఒక రోజు ముందు ఆమె మాజీ భర్త రాజీవ్ కూడా ఆ వీడియోపై స్పందించాడు. చారు ఆర్థికంగా బాగానే ఉందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం ఆమె బికనీర్ షిఫ్ట్ అయ్యిందని తెలిపాడు. మాజీ భర్త రాజీవ్ సేన్ తో తెగదెంపులు చేసుకున్నా చారు అసోపా... తన వదిన సుస్మితా సేన్ పట్ల మాత్రం గౌరవంగానే వ్యవహరిస్తోంది. విడాకుల సమయంలో తనకు సుస్మిత నే దన్నుగా నిలబడిందని అప్పట్లో చారు చెప్పడం విశేషం. ఏదేమైనా... చారు ఇచ్చిన ఈ క్లారిటీతో అయినా... ఆమెకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం ఆగిపోతుందేమో చూడాలి.

Also Read: Telugu Cinema: దిల్ రాజు కొత్త అడుగు....

Also Read: Sriwass: రవితేజ ప్రాజెక్ట్ సందీప్ కిషన్ కిట్ లోకి...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 12 , 2025 | 05:24 PM