Telugu Cinema: దిల్ రాజు కొత్త అడుగు....

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:38 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సినిమా, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి సంబంధించి చర్చించారు.

ప్రముఖ నిర్మాత, టి.ఎస్.ఎఫ్.డి.సి. చైర్మన్ దిల్ రాజు (Dil Raju), నిర్మాత హర్షిత్ రెడ్డి (Harshith Reddy) ఇటీవల హైదరాబాద్‌లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ (Australian Consulate General) ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ బృందంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్ స్టీవెన్ కానోలీ, వైస్ కాన్సుల్ హారియట్ వైట్, స్టెఫీ చెరియన్ ఉన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య... ముఖ్యంగా సినిమా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను ఎలా మరింత పటిష్టం చేసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.


ఇరు దేశాల మధ్య సినిమా సహ నిర్మాణాలు (Co-productions), సాంస్కృతిక కార్యక్రమాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల మారకము (Talent exchange) వంటి పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంపైనా, తెలుగు సినిమాపైనా ఆస్ట్రేలియా ప్రతినిధులు ఎంతో ఆసక్తి, ఉత్సాహం చూపించారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య బంధం మరింత బలపడుతుందని, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఇరు పక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Also Read: Sriwass: రవితేజ ప్రాజెక్ట్ సందీప్ కిషన్ కిట్ లోకి...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 12 , 2025 | 04:38 PM