Oppenheimer: ఓటీటీలోకి వచ్చేసిన.. హలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ
ABN , First Publish Date - 2023-11-22T17:56:11+05:30 IST
2023 హలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సినిమా ఒపెన్‌హైమర్ ఐదు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. దాదాపు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 21న విడుదలై భారీ విజయం సాధించింది. ఆటం బాంబు సృష్టికర్త రాబర్ట్ ఒపెన్ హైమర్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా రిలీజైన ప్రతిచోటా మంచి కలెక్షన్లు రాబట్టి థియేటర్ రన్ ముగిసేసరికి 950 మిలియన్ డాలర్లు ఆర్జించి పెట్టింది.
2023 హలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సినిమా ఒపెన్‌హైమర్ (Oppenheimer) ఐదు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. దాదాపు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 21న విడుదలై భారీ విజయం సాధించింది. ఆటం బాంబు సృష్టికర్త రాబర్ట్ ఒపెన్ హైమర్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా రిలీజైన ప్రతిచోటా మంచి కలెక్షన్లు రాబట్టి థియేటర్ రన్ ముగిసేసరికి 950 మిలియన్ డాలర్లు ఆర్జించి పెట్టింది.
అమెరికా న్యూక్లియర్ బాంబు తయారుచేసే సమయంలో, తయారు చేశాక రాబర్ట్ ఒపెన్‌హైమర్(Oppenheimer)కు ఎదురైన అనుభవాలు, నడిచిన రాజకీయాలు, కోర్టు కేసులు తదితర నిజ జీవిత ఘటనల అధారంగా క్రిష్టోపర్ నోలన్ (Christopher Nolan) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఇన్‌సిప్షన్, ఇన్‌స్టాస్టెల్లార్, టెనెట్ వంటి ఆద్భుత కళాకండాలతో ప్రపంచ వ్యాప్తంగా హీరోలకు సమానంగా ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పర్చుకున్న ఘనత నోలన్ సొంతం. ఆయనకున్న ఈ ఇమేజ్‌తో ఈసినిమా రేంజ్ మరో స్థాయికి చేరి 950 మిలియన్ డాలర్ల(రూ.1426) కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టింది.
అయితే ఇప్పుడు 3గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ ఒపెన్‌హైమర్ (Oppenheimer) సినిమాను ఓటీటీకి తీసుకు రాగా అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్‌మైషోలలో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది. 48 గంటల కాల పరిమితిలో రూ.149 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. అదేవిధంగా ఈ సినిమాతో పాటు థియేటర్‌లో విడుదలైన మరో రెండు మోస్ట్ వాంటెడ్ చిత్రాలు బార్బీ(Barbie), మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికానింగ్ (Mission: Impossible - Dead Reckoning Part One) సినిమాలు కూడా అమెజాన్‌లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిపై కూడా ఓ లుక్కేయండి.