ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:52 AM
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వార్-2’. కియారా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం...
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వార్-2’. కియారా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హృతిక్ రోషన్ సినిమా విశేషాలను వివరిస్తూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌తో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నాను. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ‘వార్-1’తో పోల్చితే రెండో భాగం భారీగా ఉంటుంది. ఈ చిత్ర నిర్మాణం సులభంగా పూర్తయ్యింది. నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు అయాన్ ముఖర్జీ వల్లే ఇది సాధ్యమైంది. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా ఉంది’ అని పేర్కొన్నారు.