రావయ్యా అంజని తనయా!
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:58 AM
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బేనర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌కు...
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బేనర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. చిత్రబృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ‘విశ్వంభర’ నుంచి తొలి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. సీతారాముల కల్యాణం నేపథ్యంలో సాగే గీతమిది. ‘రామ రామ’ అంటూ మొదలైన ఈ గీతం శ్రీరాముని పట్ల హనుమంతుడికి ఉన్న అచంచలమైన ప్రేమ, భక్తిని వివరిస్తూ సాగుతుంది. ఎంఎం కీరవాణి స్వరకల్పన చేయగా, శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. ఈ పాటలో చిరంజీవి సంప్రదాయ దుస్తుల్లో సరికొత్త లుక్‌తో ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఆయన స్టెప్పులు గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.