L2: Empuraan: మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ల మ్యాజిక్ 'L2: ఎంపురాన్‌' టీజర్

ABN, Publish Date - Jan 26 , 2025 | 07:48 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం.. మలయాళ సినిమాలను రీమేక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అలా మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీ అంటే కొత్త క‌థాంశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటూ ముందుకు సాగిపోతుంది. అలాంటి మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీ నుంచి అటు మాస్‌, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ కంప్లీట్ యాక్ట‌ర్ ఇమేజ్‌ను సంపాదించుకున్న న‌టుడు మోహ‌న్ లాల్‌

మోహన్‌లాల్‌ (Mohan Lal) కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌ (రాజు కన్నా గొప్పవాడు)’(L2: Empuraan) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్‌ సుకుమార్‌, మంజు వారియర్‌, టొవినో థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Updated at - Jan 26 , 2025 | 07:48 PM