Avatar: Fire and Ash: అవతార్‌ -3 జేమ్స్‌ అప్‌డేట్‌ ఏంటంటే..

ABN , Publish Date - Apr 04 , 2025 | 06:41 PM

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ అవతార్‌. ఆ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే!  


హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ అవతార్‌. ఆ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే!  పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్ది అందరినీ ఆకట్టుకున్నారు జేమ్స్‌. ఆ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మరో ట్రీట్‌ ఇచ్చారు. ఇప్పుడు  మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar 3) రూపొందిస్తున్నారు. గత రెండు చిత్రాలతో కంపేర్‌ చేస్తే పార్ట్‌ 3 ఎంతో ఆసక్తిగా ఉంటుందని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) మొదటి నుంచి చెబుతున్నారు. తాజాగా జరిగిన సినిమాకాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘అవతార్‌ 3’ విశేషాలను పంచుకున్నారు.



"ఇప్పటివరకూ చూసిన చిత్రాలతో పోలిస్తే ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తొలి రెండు భాగాల్లో జేక్‌ కుటుంబం.. మానవ ప్రపంచం తో పోరాటం చేసింది. కానీ పార్ట్‌3లో అలా కాదు. ఇందులో కొత్త విలన్స్‌ పుట్టుకొస్తారు.  యాష్‌ ప్రపంచంలోని తెగలతోనూ జేక్‌ కుటుంబం పోరాటం చేస్తుంది. మొదటి పార్ట్‌లో భూమి, రెండో భాగంలో సముద్రం, ఇక ఇప్పుడు చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూడబోతున్నాం. ఈ సినిమాకు కూడా ప్రేక్షకులు తప్పరరకుండా ఆస్వాదిస్తారని నమ్ముతున్నా ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్ లో విడుదల చేస్తాం’’ అని అన్నారు. అవతార్‌ - 3, ఈ ఏడాది డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘అవతార్‌ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031 లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించారు. 

Updated Date - Apr 04 , 2025 | 06:44 PM