Coolie Vs War -2: ఒకే రోజు రెండు పెద్ద చిత్రాల వార్
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:14 PM
రెండు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదలైతే ఎలా ఉంటుంది? అభిమానుల మధ్య పెద్ద పోటీనే ఉంటుంది. అందుకు సిద్ధమా అంటున్నారు.. వార్ 2, కూలీ సినిమాల మేకర్స్
రజినీకాంత్ (Rajinikanth) హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’ (Coolie). నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్టు 14న రిలీజ్ (Coolie Release Date) చేయనున్నట్టు టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అందులో రజనీకాంత్ విజిల్ వేస్తూ స్టైలిష్ లుక్ లో కనిపించారు. గోల్డ్ స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది.
హృతిక్ రోషన్ (Hrithik Roshan)- ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం వార్ -2. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఆగస్టు 14న తమ సినిమాని తీసుకురానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ఓ అభిమాని పెట్టిన పోస్టుపై యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పందించింది. ఆ తేదీన అల్లకల్లోలం జరుగుతుందంటూ ఆసక్తి రేకెత్తించేలా పోస్ట్ చేసింది. రెండు పెద్ద చిత్రాలు ఒకే రోజు విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి చెలరేగింది.