Chhorii 2: మరోసారి భయపెట్టదానికి వస్తున్న ‘చోరి’
ABN, Publish Date - Apr 03 , 2025 | 03:46 PM
‘చోరి’ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెల్సిందే. 2021లో వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన సినిమా ఇది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘చోరీ 2’ (Chhorii 2) రానుంది. విశాల్ ఫూరియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘పీడకలలు ఎప్పటికీ మర్చిపోలేం. అవి ఈసారి మరింత దారుణంగా ఉంటాయి’ అంటూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా ప్రధానపాత్రలో నటించారు.
Updated at - Apr 03 , 2025 | 04:06 PM