Oh Bhama Ayyo Rama : 'ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే’

ABN, Publish Date - Apr 03 , 2025 | 05:36 PM

సుహాస్ నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ నటి మాళవిక మనోజ్ కథానాయిక. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా వస్తున్న ఈ చిత్రంలో  ‘ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే’ అంటూ సాగే  టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. రథన్‌ స్వరాలు సమకూర్చారు.   శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించగా, శరత్‌ సంతోష్‌ ఆలపించారు. 

Updated at - Apr 03 , 2025 | 05:55 PM